English   

ఉప్పెనగా వస్తున్న వైష్ణవ్ తేజ్

Vaishnav Tej
2019-05-07 18:02:55

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే ఈ సినిమాకి ఉప్పెన‌ అనే టైటిల్‌ ను ఖ‌రారు చేశారు. ద‌ర్శకుడు సుకుమార్ వ‌ద్ద ద‌ర్శక‌త్వ శాఖలో ప‌ని చేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈరోజు సినిమా టైటిల్‌ ను ఖరారు చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. క‌థకు ఎలాంటి టైటిల్ పెట్టాల‌నే విషయంలో చాలా ఆలోచించామని, క‌థ‌కు త‌గిన విధంగా ‘ఉప్పెన‌’ టైటిల్ అయితే ప‌క్కాగా కుదురుతుందని దాన్నే ఖరారు చేసినట్లు యూనిట్ పేర్కొంది. అలాగే  త‌మిళంలో వైవిధ్యమైన పాత్రల‌ను పోషించి త‌న‌కుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న న‌టుడు విజయ్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్రలో న‌టిస్తున్నారనీ ఈ నెలలోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్నామని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.  
 

More Related Stories