English   

పొద్దున్న ఎన్టీఆర్ తో మధ్యాహ్నం మహేష్ తో రాత్రప్పుడు ప్రభాస్ తో ....

Pooja Hegde
2019-05-07 18:37:22

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రస్తుతం టాలీవుడ్‌ పూజా హెగ్డే హవా నడుస్తోంది. టాలీవుడ్ టాప్‌ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఆమె. టాప్ హీరోలందరూ పూజతో కలిసి నటించేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. కెరీర్‌లో ఒక్క బిగ్‌ హిట్ లేకపోయినా ఆమె క్రేజ్ ఏంటో అర్ధం కావట్లేదు. ఈ భామ ఎన్టీఆర్‌ సరనస హీరోయిన్‌గా నటించిన ‘అరవింద సమేత’  ఇప్పటికే రిలీజ్‌ కాగా, మహేష్‌ సరసన నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం లవ్ స్టోరీ మాత్రం సెట్స్‌ మీద ఉంది. తాజాగా మహర్షి ప్రమోషన్స్ లో భాగంగా టాప్‌ హీరోలతో కలిసి నటించటంపై ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది పూజా. అరవింద సమేత, మహర్షి, ప్రభాస్‌ సినిమాలు మూడూ ఒకేరోజు షూటింగ్ జరగటంతో పూజా ఒకే రోజు ముగ్గురు హీరోలతో కలిసి నటించాల్సి వచ్చిందట. ఉదయం 7 నుండి 12 వరకు ఎన్టీఆర్ తో 'అరవింద సమేత', మధ్యాహ్నం 2 నుండి 6 వరకు మహేష్ బాబు 'మహర్షి', రాత్రి 9 నుండి ఉదయం 2 గంటల వరకు ప్రభాస్ సినిమా చేశానని చెప్పుకొచ్చింది. ఈ షెడ్యూల్స్‌ అప్పుడు రోజుకు కేవలం నాలుగు గంటల మాత్రమే నిద్రపోయేందుకు సమయం దొరికేదనీ కానీ కష్టమనిపించినా ఒకేసారి ముగ్గురు టాప్‌ హీరోలతో కలిసి నటించటం ఆనందంగా ఉందని చెబుతోంది పూజ. 

More Related Stories