English   

మహర్షి కోసం రంగంలోకి బన్నీ, ప్రభాస్ లు ?

Mahesh
2019-05-07 19:00:21

మరో రెండ్రోజుల్లో విడుదల కానున్న మహర్షి సినిమాకి పాజిటివ్ టాక్ అబ్బురపరుస్తోంది. ఈ సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ లో వెల్లువలా అమ్ముడు పోతున్నాయి. దీంతో మహేష్ గత మే సెంటిమెంట్లను ఈ సినిమా తుడిచి పెట్టేస్తుందని భావిస్తున్నారు ట్రేడ్ అనలిస్ట్లు. అయితే ఈ క్రమంలో మహేష్ విషయానికి బన్నీ, ప్రభాస్ లు ఇన్వాల్వ్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరుగుతున్న ప్రచారం మేరకు అల్లు అర్జున్, ప్రభాస్ లకు సంబంధించిన గీత ఆర్ట్స్ యూవీ క్రియేషన్స్ వాళ్ళు దిల్ రాజ్ తో కలిసి ఈ సినిమా కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారని వార్తలు వస్తున్న్నాయి. దీని ప్రకారం మహర్షి మేనియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో నిజమెంతుందో తెలీదు కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విని గాల్లో తేలుతున్నారు. అయితే ఈ విషయం అంత నమ్మదగినదిగా లేదు ఎందుకంటే ఈ సినిమా దిల్ రాజు ఒక్కడు నిర్మించలేదు ఇప్పటికే ఆయనకు మరో ఇద్దరు పార్టనర్స్ ఉన్నారు, అందులో ఒకరు పీవీపీ సంస్థల అధినేత పీవీపీ ఉన్నారు. ఆయన ఎటూ తన మాల్స్ లో వేసుకుంటారు, ఇక బయటవి సరిపెట్టుకోడానికి అశ్వినీదత్ అలాగే దిల్ రాజు రెడీగా ఉన్నారు, సో ఈ ప్రచారం అయితే నిజం కాకపోవచ్చనే మరో వాదన వినిపిస్తోంది. 

More Related Stories