English   

మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

maharshi
2019-05-07 19:56:45

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా మహర్షి. ఈ నెల 9న రాబోతున్న ‘మహర్షి’ సినిమా పై సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల కూడా మంచి అంచనాలతో    ఎదురు చూస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ ముగ్గురూ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఇండస్ట్రీ లో పెద్ద సినిమాలకు ఇచ్చినట్టు గానీ ఈ సినిమాకి కూడా తెలంగాణ ప్రభుత్వం మద్దతూ గా నిలిచింది. వేసవికి ఏకైక సినిమా కావడంతో భారీ ఎత్తున థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తోన్నా ఇప్పటికే సౌల్డ్ ఔట్ అయిపోయాయి.  థియేటర్ల సంఖ్య పెంచినా, టికెట్లు దొరకడం లేదు. దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమాకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో 5 షోలు వేసుకోవటానికి అనుమతి ఇచ్చింది. మహేశ్ బాబు ఫ్యాన్స్ కు ఖచ్చితంగా ఇది గుడ్ న్యూసే. ఇక మరోపక్క మహర్షి క్రేజ్ ను బట్టి థియేటర్ యాజమాన్యాలు రేట్లు పెంచేశాయి.
 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 టికెట్ ధర రూ. 110కి పెంచగా మల్టీఫ్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ.50 పెంచినట్టు సమాచారం.
హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో అయితే రూ.138 రూపాయలున్న ఒక్కో టికెట్ ధరను ఏకంగా రూ.200కు యాజమాన్యం పెంచినట్లు సమాచారం.
అయితే ప్రభుత్వ అనుమతితో టికెట్ ధరలు పెంచినట్లు థియేటర్ యాజమాన్యాలు వెల్లడించాయని అంటున్నారు.
ఈ పెంచిన టికెట్ ధరలు రెండు వారాలపాటు అమలు చేయనున్నట్టు థియేటర్ యాజమాన్యాలు పేర్కొన్నాయి. మొత్తానికి ‘మహర్షి’ ఈ రికార్డ్ స్థాయిలో బుకింగ్స్, అలాగే రేట్లు చూస్తుంటే.. ‘మహర్షి’ ఫస్ట్ డే కలెక్షన్స్, అలాగే టోటల్ కలెక్షన్స్ విషయంలో సరి కొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందనేది.

More Related Stories