English   

అంతా ఒట్టిదే...రేట్లు ఏమీ పెరగలేదు

cinema
2019-05-08 08:16:35

మహర్షి సినిమా విడుదల నేపథ్యంలో హైదరాబాద్ లోని సాధారణ థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు టికెట్ ధరలను పెంచాయని నిన్న సాయంత్రం నుండి ప్రచారం జరుగుతోంది. దీని మీద మహేష్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుంటే ప్రేక్షకులు మాత్రం మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ ప్రచారం మీద రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 80 రూపాయలున్న టికెట్ ధరను110 రూపాయలకు, మల్టీఫ్లెక్స్ లో ఒక్కో టికెట్ పై 50 రూపాయలు పెంచినట్లు వివిధ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచిన దాఖలాలు లేవని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మెద్దని మంత్రి పేర్కొన్నారు. మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన మహర్షి సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించాడు. 

More Related Stories