English   

అజయ్ స్పెషల్ గా వస్తున్నాడు ?

 Ajay
2019-05-08 11:19:51

తెలుగులో ఉన్న విలక్షణ నటుల్లో నటుడు అజయ్ ఒకరు. తొలుత సపోర్టింగ్ రోల్స్ తో సినీ జీవితం ప్రారంభించిన అజయ్ కి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా లైఫ్ టర్నింగ్ పాయింటి. ఆ సినిమాలో విలన్ గా నటించిన అజయ్ టిట్లాగా అదరగొట్టే పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు. అయితే ఆయన లీడ్ రోల్స్ లో కొన్ని సినిమాలు వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆయన లీడ్ రోల్ లో ఒక సినిమా తెరకెక్కింది. అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్న స్పెషల్ అనే టైటిల్ గల సినిమాలో అజయ్ కీలక పాత్ర పోషించాడు. ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్ చేసి చీట్ చేసి వదిలేస్తుంది. ఆ అమ్మాయి అలా అతన్ని చీట్ చేయడానికి కారణమైన వాళ్లమీద ఆ ప్రేమించబడ్డ వ్యక్తి రివెంజ్ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారా సైకాలజీ స్కిల్ మీద ఈ సినిమా కధ రాసుకున్నారట. ఇందులో అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారట. వాస్తవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి ఇదయినా అజయ్ కి సింగిల్ హీరోగా పేరు తెచ్చిపెడుతుందో లేదో ?

More Related Stories