English   

క్రిష్ తర్వాతి సినిమా ఆ స్టార్ హీరోతో ?

Akshay Kumar
2019-05-08 12:05:54

దర్శకుడు క్రిష్‌ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత మరే సినిమా ప్రకటించలేదు. నిన్నమొన్నటి దాకా మీడియా కంట కూడా పాడనీ ఆయన ఆ మధ్య జెర్సీ హీరో, డైరెక్టర్ తో కలిసి ఇంటర్వ్యూ చేసి మళ్ళీ అజ్ఞాతం వీడాడు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఆయన బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ తో ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఇప్పటికే అక్షయ్‌ కు క్రిష్‌ కథ చెప్పి ఓకే చేసుకున్నారని డేట్స్ ఇతరత్రా వివరాలు అన్నీ అనుకున్నాక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని ఓ ఆంగ్లపత్రిక కధనాన్ని ప్రచురించింది. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమా పేరు ఖిలాడీగా ఉండనుందని అంటున్నారు. ఇప్పటికే అక్షయ్‌, క్రిష్‌ కాంబినేషన్‌ లో గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌ సినిమా వచ్చింది. ఈ సినిమాకి కూడా మంచి పేరు వచ్చింది. ఈ మధ్య కాలంలో కేసరితో హిట్‌ అందుకున్న అక్షయ్‌ మిషన్‌ మంగళ్‌, హౌస్‌ఫుల్‌ 4, గుడ్‌న్యూస్‌, ‘లక్ష్మీబాంబ్‌’ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా దాదాపు ఓకే అయినట్టే చెబుతున్నారు. 

More Related Stories