English   

హాట్ హాట్ ఫోటో షూట్ లో తేజస్వీ మాదివాడ

 Tejaswi Madivada
2019-05-08 13:30:10

తేజస్వి మాదివాడ అంటే ఎవరూ గుర్తు పట్టరేమో కానీ ‘బిగ్‌బాస్ లో కౌశల్ లో గొడవ పెట్టుకున్న తేజస్వి అంటే యిట్టె గుర్తు పడతారు. హౌస్ లోపల పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని గ్లామర్ షో చేసిన తేజస్వి, అప్పటికే పెళ్లైన సామ్రాట్‌ తో ఆన్ కెమెరా సరసాలు సాగించింది. తేజస్వి,సామ్రాట్ ఇన్సిడెంట్ అప్పట్లో పెద్ద డిస్కర్షన్‌ రేపింది. వాటితో సంబంధం లేకుండా ‘బిగ్‌బాస్’ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సామ్రాట్‌తో చనువుగా ఉంటున్న తేజస్వి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రేపుతోంది. తాజాగా బికినీలో బాత్‌రూమ్ టబ్‌లో కూర్చుని ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. షవర్‌ను ఫోన్‌లా వాడుతూ నవ్వుతున్నట్టుగా మడోన్నా స్టైల్‌లో ఫోజిచ్చింది. మోకాళ్ళపై కూర్చొని ఎడమ చేతిని వెనక్కు పెట్టి పర్ఫెక్ట్ షేప్ లో ఉన్న వీపు భాగాన్ని ఎలాంటి సంకోచాలు లేకుండా ప్రదర్శించింది. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ “బ్యాక్ వర్క్ అవుట్ పని చేస్తోంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.. నో ఫిల్టర్.. నో ఎడిటింగ్ అని పేర్కొంది. 

More Related Stories