English   

దిల్ రాజు ఆఫీస్ ఇళ్ల మీద ఐటీ దాడులు 

Dil Raju
2019-05-08 13:50:25

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కు ఈరోజు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని దిల్ రాజు ఇంటితో పాటు సాగర్ సొసైటీ. లోని ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే  విడివిడిగా వచ్చిన అధికారులు ఇంటితో పాటు ఆఫీసులను రికార్డులను పరిశీలిస్తున్నారు. మహేష్  బాబు హీరోగా నటించిన మహర్షికి దిల్ రాజు సహ-నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఈ సినిమా బడ్జెట్‌, బిజినెస్‌, కలెక్షన్లపై అధికారులు ఆరా తీస్తున్నారనీ సమాచారం. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఎఫ్2 సినిమా కూడా 100 కోట్ల మార్క్ అందుకుంది. దీంతో గతంలో చెల్లించిన పన్ను, కలెక్షన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ‌తంలోను భారీ చిత్రాల రిలీజ్ స‌మ‌యంలో నిర్మాత‌ల ఆఫీసులు, ఇళ్ల‌పై ఐటీ సోదాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 

More Related Stories