English   

తెలంగాణా ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్తున్న మహర్షి థియేటర్స్

Maharshi
2019-05-08 16:32:51

సూపర్ స్టార్ మహేష్‌ బాబు మహర్షి సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా క్రేజ్ దృష్ట్యా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయి పోతున్నాయి. అయితే మహర్షి టిక్కెట్ ధరల పెంపుపై థియేటర్ల యాజమాన్యాలు, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తింది. తెలంగాణలోని కొన్ని థియేటర్లు టిక్కెట్ ధరలను పెంచి విక్రయిస్తున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ థియేటర్ల యాజమాన్యాలపై చర్యలకు ఉపక్రమించింది. మహర్షి భారీ బడ్జెట్‌ సినిమా కావటంతో తెలంగాణలో అదనపు షోలు వేసుకునేందుకు ప్రభుత్వాన్ని అనుమతించాల్సిందిగా కోరామని, దీనికి ప్రభుత్వం సమ్మతించిందని నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు వెల్లడించారు. మహర్షి ఐదు షోల ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించిందని, థియేటర్ యజమానుల విజ్ఞప్తి మేరకు కోర్టు సైతం టిక్కెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చిందని ఆయన చెబుతున్నారు. అయితే ఈ వార్తలను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన తలసాని టిక్కెట్ల రేట్లు పెంచి అమ్మితే బాధ్యులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దీంతో ఇప్పుడు థియేటర్ యాజమాన్యాలు ఈ విషయం మీద కోర్టు వెళ్లేందుకు యోచిస్తున్నారు.

More Related Stories