English   

అనుపమ్ ఖేర్ కి పరాభవం 

Anupam Kher
2019-05-08 17:58:29

బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ కు వరుస పెట్టి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం జనాలు లేక ఆయన సభ రద్దవగా ఈరోజు ఆయన చేస్తున్న ప్రచారంలో ఎదురు షాక్ ఇచ్చారు వోటర్లు. అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ చండీగఢ్ నుంచి బీజేపీ తరపున ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. దీంతో, ఆమె తరపున అనుపమ్ ఖేర్ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కావడంతో ఆయన చరిష్మా ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. అయితే ఆయనకు మాత్రం వోటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈరోజు ఆయన ప్రచారంలో భాగంగా ఒక షాపులోకి వెళ్లారు. బీజేపీకి ఓటు వేయాలని ఆ షాపు ఓనరును కోరారు. అయితే చిర్రెత్తుకొచ్చిన ఆ షాప్ ఓనర్ అసలు బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి? అది కూడా సాలు మీకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించాడు. అక్కడితో ఆగాడా అంటే ఆగకుండా 2014లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి వీటిలో ఒక్కటైనా నెరవేర్చారా ? ఇంకా ఏ మొహం పెట్టుకుని వోట్లు అడగడానికి వచ్చారు అంటూ ప్రశ్నించేసరికే అక్కడి నుండి సైలెంట్ గా జారుకున్నారు అనుపమ్ ఖేర్. 

More Related Stories