English   

మహేష్ మహర్షి ప్రివ్యూ !

maharshi Preview
2019-05-08 19:40:56

మహేష్ బాబు మహర్షి సినిమా మానియా మొదలయ్యింది. మహేష్ కెరీర్లో మహిర్షి 25వ సినిమా కావడంతో పాటు దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి వంటి సీనియర్ ప్రొడ్యూసర్స్ ప్రతిష్టాత్మకంగా దాదాపు 130 కోట్లతో నిర్మించడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఊపిరి వంటి సక్సెస్ పుల్ చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా మీద మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. సెన్సార్ సహా అన్నికార్యక్రమాలూ పూర్తి చేసుకొన్న ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. అయితే ఈ చిత్రం బడ్జెట్ కాస్త ఎక్కువే అయ్యిందట. నిర్మాతలు 1౩౦ అని చెబుతున్నా ఈ సినిమాకి నుంచి దాదాపు 150 కోట్లు అయ్యిందని అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. ముందు జాగ్రత్తగా 5 షోలు వేసుకునేందుకు పర్మీషన్ కూడా తెచ్చుకున్నారు.  మ‌హేష్ స్టూడెంట్‌గా, బిజినెస్ మేన్‌గా, రైతుగా త్రీ షేడ్స్‌లో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీ రన్ టైమ్ విష‌యానికి వ‌స్తే... 5 నిమిషాల తక్కువ మూడు గంటల నిడివి(175నిమిషాలు) అని స‌మాచారం. ఈ సినిమా ఖ‌చ్చితంగా పెద్ద విజ‌యం సాధిస్తుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు మేకర్స్. మహేష్ బాబుకి మే నెల సెంటిమెంటు వున్నా వేరేవేరే కారణాల వలన ఈ సినిమా కాబట్టి భారీ హిట్ ఖాయం అంటున్నారు నిర్మాతలు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories