English   

డియర్ కామ్రేడ్ డేట్ లాకయింది

dear
2019-05-08 20:55:11

యూత్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న రెండో సారి జంట‌గా న‌టించిన మూవీ ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్’ అనే ట్యాగ్ లైన్ తో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ మీద ఈ సినిమా తెరకెక్కుతోంది. సుమారు ఏడాది క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు గతః నెల చివరిలో షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా ముందు మే 31 న రిలీజ్ చేయలని అనుకున్నారు. అయితే అదే రోజు ఎన్జీకే తో పాటు విక్రం నటించిన మరో మూవీ కూడా రిలీజ్ కి ఉండడం ఈ సినిమా ఏమో ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌ం, మ‌ల‌యాళ‌ం, కన్నడ భాష‌ల్లో ఒకే రోజున విడుద‌ల చేయాలని ప్లాన్ చేయడంతో పోటీ వద్దనుకుని వెనక్కి తగ్గారు. ఫైనల్ గా ఈ సినిమా ఎప్పుడు అనేది రేపు విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు సందర్భంగా విడుదల తేదీని బుధవారం ప్రకటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను జూలై 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు విజయ్ దేవరకొండ. ఈ మేరకు విజయ్ దేవరకొండ కూడా ఒక ట్వీట్ చేశారు.  ‘కామ్రేడ్స్ వినండి! 26 జూలై 2019’ అని ట్వీట్‌లో విజయ్ పేర్కొన్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన టీజ‌ర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసిని ఆ టీజర్.

More Related Stories