English   

కార్తికేయ గుణ టైటిల్ మీద వివాదం

guna369
2019-05-08 22:08:58

ఆర్ ఎక్స్ 100' సినిమాతో సెన్సేషనల్ హిట్ ను కొట్టిన  కార్తికేయ, ప్రస్తుతం 'హిప్పీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన 'గుణ 369' అనే టైటిల్ తో మరో ప్రాజెక్టును ను పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ఈ మధ్యనే టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. అందులో కార్తికేయ భారీ కండ‌లు మాత్ర‌మే చూపించి ఫేస్‌ని దాచారు. అయితే ప్ర‌స్తుతం చిత్ర‌ టైటిల్ విష‌యంలో వివాదం త‌లెత్తింది. క‌ళాధ‌ర్ కొక్కొండ అనే నిర్మాత గుణ అనే టైటిల్‌ని ఇప్ప‌టికే ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేయించాడ‌ట‌. ఈ సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. అయితే త‌న సినిమా టైటిల్‌కి ప‌క్క‌న 369 అనే అంకెని త‌గిలించి కొత్త టైటిల్‌లా గుణ 369 ని అనౌన్స్ చేశార‌ని క‌ళాధ‌ర్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More Related Stories