English   

స్టార్ హీరో విజయ్ మీద నటుడు సంచలన వ్యాఖ్యలు 

vijay
2019-05-09 07:58:50

తమిళ స్టార్ హీరో విజయ్ మీద మలయాళ నటుడు సిద్ధిఖీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ్ సూపర్ స్టార్ కావచ్చేమో కానీ సూపర్ నటుడయితే మాత్రం కాదని వ్యాఖ్యానించారు. ఈ మధ్య ఒక చానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ, విజయ్ ని ‘సూపర్ స్టార్’ గా ప్రేక్షకులు అంగీకరించినా నిజానికి ఆయన గొప్ప నటుడేమీ కాదని, కేవలం, స్టార్ డమ్ మాత్రమే ఆయన్ని నడిపిస్తోందని అన్నారు. తన దృష్టిలో మంచి నటుడు సూపర్ స్టార్ కమలహాసన్ మాత్రమేనని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా తమ మలయాళ చిత్ర పరిశ్రమ గురించి పేర్కొంటూ మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి గొప్ప నటులు తమకు ఉండటం తమ చిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టం అని మమ్ముట్టి, మోహన్ లాల్ లు తమకు ఎంతో సాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి చిత్ర పరిశ్రమ అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ ను బట్టి రాణిస్తుందని, అలాంటి వాళ్ల వల్లే తమ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు జీవించగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే విజయ్ పై సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విజయ్ అభిమానులు ఆయన మీద సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

More Related Stories