English   

మరో బయోపిక్ లో విద్యా బాలన్ 

vidhya
2019-05-09 08:11:37

బాలీవుడ్ నటీమణి విద్యది మొదటి నుండి విభిన్న పంధానే, మిగతా హీరోయిన్స్ తో పోల్చుకుంటే చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె క్రేజ్, ఆమె ఫ్యాన్ బేస్ సెపరేట్. ఇంకా బయోపిక్స్ ట్రెండ్ రాని టైములోనే ఆమె సిల్క్ స్మిత జీవిత కధ ఆడహ్రంగా డర్టీ పిక్చర్ లో నటించి దుమ్ము రేపింది. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బ‌స‌వ‌తారకం పాత్ర‌లో మెప్పించిన విద్యాబాలన్ మ‌రో బ‌యోపిక్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి . హ్యూమన్ కంప్యూటర్ , ప్రముఖ మ్యాథమేటీషియన్ శంకుతల దేవి జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందట. ఈ సినిమాలో శంకుతలా దేవి పాత్రలో విద్యా బాలన్ నటించనుందని వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ అను మీనన్ తెరకెక్కించనున్న ఈ సినిమాని విక్రమ్ మల్హోత్రా నిర్మించనున్నారట.  ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించిన విద్యా బాలన్ శంకుతలా దేవి పాత్రలో నటించడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని, ఒక చిన్న టౌన్ అమ్మాయి తన టాలెంట్ తో ప్రపంచాన్ని ఎలా తనవైపుకు తిప్పుకుందనేది మీరు చూడబోతున్నారని పేర్కొంటూ ఆమె ట్వీట్ చేసింది.

More Related Stories