English   

మహర్షి క్రేజ్ ని వాడుకుంటున్న సీత 

Sita
2019-05-09 11:17:12

చాలా గ్యాప్ తర్వాత తేజ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన మూవీ సీత. లేడీ ఒరిఎంటేడ్ సబ్జెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నెగిటివ్ రోల్ పోషించగా RX 100 పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా విడుదల తేదీని కూడా ఈ మధ్యనే ఫైనల్ చేశారు. మే 24న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ టీం భలే ప్లాన్ చేసిందందోయ్ అదేంటంటే ఈ సినిమా ట్రైలర్‌ను ‘మహర్షి’ సినిమా మధ్యలో అదే ఇంటర్వెల్ లో ప్రదర్శించనున్నారట. ఈరోజు మహర్షి పెద్ద ఎత్తున రిలీజ్ కానున్న నేపధ్యంలో మహర్షి థియేటర్లలో సీత ట్రైలర్ ప్లే కానుంది. మహర్షి సినిమాకు ప్రస్తుతం విపరీతమయిన క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం మహేష్‌బాబు అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఈ క్రేజ్‌నే సొమ్ము చేసుకోవడానికి సీత టీమ్ ప్రయత్నిస్తోందన్న మాట.  

More Related Stories