English   

జాక్ పాట్ కొట్టిన మానుషి ?

Manushi Chhillar
2019-05-09 11:24:13

2017లో ప్రపంచసుందరిగా కిరీటం గెలుచుకున్న మానుషి చిల్లర్‌ ఆనాటి నుండే సినీ రంగప్రవేశం కోసం ట్రై చేసినా ఆమెకు అవకాశం దక్కలేదు. తాజాగా ఆమెకు బంపర్ ఆఫర్ తగిలింది. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ లాంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న భారీ హిస్టారికల్‌ మూవీలో ఒక స్టార్ హీరో సరసన ఈ అమ్మడు అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. పృథ్వీరాజ్‌ చౌహన్‌ బయోపిక్‌ లో చౌహాన్ పాత్రకు అక్ష‌య్ ను తీసుకోగా, మ‌హ‌రాణి పాత్రకి చిల్ల‌ర్ ను ఎంపిక చేశారని అంటున్నారు. ఈ సినిమాకి పింజర్‌, మొహళ్ల అస్సీ లాంటి హిట్స్ అందించిన చంద్రప్రకాష్‌ ద్వివేది ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా ప్రారంభం కానున్న ఈ సినిమా ఎందరో డెబ్యూ హీరోయిన్స్ ని పరిచయం చేసిన యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.

More Related Stories