English   

మహర్షి మూవీ రివ్యూ

Maharshi
2019-05-09 12:57:59

సూపర్ స్టార్ మహేష్ నటించిన 25వ సినిమా మహర్షి. వంశీ పైడిపల్ల్లి దర్శకత్వంలో పూగా హెగ్డే లేడీ లీడ్ గా నటించిన ఈ సినిమా ఈరోజు విడుదల అయింది. ఒక రకంగా మహేష్ క్రేజ్ ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొల్పింది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. అంత రేంజ్ లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఏమేరకు అంచనాలను అందుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ: 

ప్రపంచంలోనే వన్నాఫ్ ది టాప్ సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవోగా నియమించబడతాడు రిషి కుమార్(మహేష్ బాబు). దీంతో తెలుగు వాడయిన ఈయన మీద మీడియా ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో ఆయన కాలేజ్ లో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ ఆయనకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు, ఈ క్రమంలో తనతో బాగా క్లోజ్ గా ఉండే రవి(అల్లరి నరేష్) గురించి కనుక్కునే పనిలో పడి అతను ఎందుకు రాలేదో కనుక్కుని అతని కోసం అన్నీ వదులుకుని ఇండియా వస్తాడు, తన వలనే ఇబ్బందుల్లో ఉన్న రవిని మళ్ళీ తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు రవి రిషితో వెళ్తాడా ? అసలు రిషిని ప్రాణంగా ప్రేమించిన పూజా (పూజా హెగ్డే) ఎందుకు దూరం అవుతుంది ? రవి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? అనేదే కధ

విశ్లేషణ :

సినిమా మేకింగ్ లో తన మార్క్ మళ్ళీ చూపించుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఒక కమర్షియల్ సినిమాకి ఒక సోషల్ ఎలిమెంట్ కలిపితే ఎలా ఉంటుందో మహేష్ గత సినిమాల్లో చూశాం. అదే ఫార్ములాని ఈ సినిమాకి కూడా వాడినా ఎక్కడా తన మార్క్ కోల్పోలేదు వంశీ. తనదైన మేకింగ్ తో జనాన్ని మెస్మరైజ్ చేశాడు. ఇక సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహేష్ బాబు గురించే కాలేజ్ స్టూడెంట్ గా , లీడింగ్ కంపెనీకి సిఈఓ గా , రైతుగా మూడు కోణాల్లో కనిపించిన మహేష్ ప్రేక్షక దేవుళ్ళని మెప్పించాడు. మూడు షేడ్స్ ఉన్న పాత్రని అవలీలగా పోషించి అద్భుతం అనిపించాడు మహేష్. సినిమాని కీలక మలుపు తిప్పే పాత్రలో అల్లరి నరేష్ పాత్ర చాలా నప్పింది. చాలాకాలంగా హిట్ కోసం తపించిపోతున్న అల్లరి నరేష్ కు మంచి పాత్ర లభించింది. కానీ పూజాకి పెద్దగా నటించే అవకాశం దక్కలేదు, విలన్ గా జగపతిబాబు పరిధి మేర నటించాడు. ఇక మిగిలిన పాత్రల్లో రావు రమేష్, సాయి కుమార్ , జయసుధ , ప్రకాష్ రాజ్ , శ్రీనివాస్ రెడ్డి , కమల్ కామరాజ్, పోసాని తదితరులు తమతమ పాత్రల్లో అలరించారు.

సాంకేతిక వర్గం విషయానికి వస్తే ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన పాటల్లో రెండు మాత్రమే వినడానికి బాగున్నాయి. అయితే పాటలు అన్నీ విజుయల్స్ పరంగా బాగానే ఉన్నాయి. రైతు సమస్యల పై మంచి కథ ఎంచుకున్న వంశీ తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.  ఇక భారీ నిర్మాణ విలువలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించి తమ సినీ ప్రేమను నిలబెట్టుకున్నారు అశ్వినిదత్ , దిల్ రాజు , పివిపి లు. సినిమాకి విజువల్స్ హైలట్. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకాస్త వర్కౌట్ చేయాల్సింది. 

ఫైనల్ గా : ఈ వేసవి హీరో మహర్షి....తప్పక చూడాల్సిన సినిమా.

రేటింగ్ : 3.5 / 5

More Related Stories