English   

పెళ్ళాం చాటు మొగుడిగా మహేష్ 

Namrata Shirodkar
2019-05-09 16:35:09

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి ఈ రోజు గ్రాండ్‌ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలవుతున్న సందర్భంగా భర్త మహేష్ భార్య నమ్రత ఇన్‌ స్టాగ్రామ్‌ లో చేసిన పోస్ట్ నెటిజన్స్‌ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. 'టు డే బిగ్ డే, మహర్షి ద్వారా ఆడియన్స్‌కి ఒక అద్భుతమైన సినిమాని ఇవ్వడానికి నువ్వెంత కష్టపడ్డావో నేను కళ్లారా చూసాను ఇప్పుడు ప్రపంచమంతా ఆ కష్టాన్ని చూడబోతుంది. గుడ్ ల‌క్ మై ల‌వ్ మ‌హేష్‌ రిషి పాత్ర నాకెంత‌గానో నచ్చింది. మీరు ఇష్ట‌ప‌డ‌తార‌ని ఆశిస్తున్నానని పేర్కొంది న‌మ్ర‌త‌. అయితే ఈ క్రమంలో న‌మ్ర‌త పోస్ట్ చేసిన ఫోటోకి నెటిజ‌న్స్ వెరైటీ వెరైటీ కామెంట్స్ పెడుతున్నారు. పెళ్ళాం చాటు మొగుడని, మహేష్ ను నమ్రత కొంగుకు కట్టేసుకుందని ఇలా రకరకాలా కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు కలిసి సినిమాలు చేసిన వీరిద్దరూ తర్వాత కాలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ సినిమాలకి సంబంధించిన విష‌యాల‌నే కాక బిజినెస్ విష‌యాల‌ని కూడా చూస్తూ భ‌ర్త‌కి స‌పోర్ట్‌గా ఉంటోంది న‌మ్ర‌త‌. 

More Related Stories