English   

కల్కి కమర్షియల్ ట్రైలర్ టాక్ 

Rajasekhar Kalki
2019-05-09 18:22:32

గరుడవేగ, చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా మంచి బూస్ట్ ఇవ్వడంతో ఆయన మళ్ళీ ఫుల్‌ స్వింగ్‌లోకి వచ్చేశారు. ప్రస్తుతం యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కల్కి చేస్తున్న రాజశేఖర్‌ ఇప్పటికే టీజర్స్‌తో అంచనాలను పెంచేశారు. తాజాగా మరో చిన్న వీడియోను కమర్షియల్‌ ట్రైలర్‌ అంటూ విడుదల చేశారు. ఈ కమర్షియల్‌ ట్రైలర్‌ను ఈ ఉదయం మహర్షి సినిమా ఇంటర్వెల్ లో వదిలారు. ఈ ట్రైలర్‌ ని బట్టి చూస్తే రాజశేఖర్‌ ఫుల్‌ జోష్‌ లో కనిపిస్తున్నాడు. ట్రైలర్‌ మొదటిలో గీతాప్రభోదం.. అటుపై ఆయన మ్యానరిజంలో చెప్పే డైలాగ్‌ చివర్లో ఆయన తనను ఇమిటేట్ చేస్తూ చేస్తున్న డ్యాన్స్ మీద ఫైర్‌ అవ్వడం లాంటివి ఈ ట్రైలర్‌ లో హైలెట్‌స్ అని చెప్పాలి, ఆదాశర్వ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే క‌ల్కి సినిమా విడుద‌లకి సిద్దమవుతోంది.  

More Related Stories