English   

అఖిల్ సినిమాకి హీరోయిన్ సమస్య 

 Akhil
2019-05-09 19:10:02

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఆయన నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి వ‌రుసగా మూడు సినిమాలతో అపజయాలు మూట కట్టుకున్నారు. ప్రస్తుతానికి స‌క్సెస్ అనే ద్రాక్ష‌ ఇంకా అందలేదు. అయితే ఆయన నాలుగో సినిమా గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. ఆయన త్వ‌ర‌లో మలుపు ఫేమ్ సత్య ప్ర‌భాస్‌ తో ఓ చిత్రం చేయ‌నున్నాడని మ‌రో పక్క పెద్ద నిర్మాణ సంస్థ‌ల‌లో ఒక‌టైన గీతా ఆర్ట్స్‌లో అఖిల్ ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని  ఈ చిత్రాన్ని బొమ్మ‌రిల్లు భాస్కర్ తెర‌కెక్కించ‌నున్నార‌ని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వీటిలో నిజమెంతుందో తెలీదు కానీ బొమ్మ‌రిల్లు భాస్కర్ ఇప్ప‌టికే స్క్రిప్ట్ సిద్దం చేసి అఖిల్‌ కి వినిపించాడని ఈ లైన్ అఖిల్ కి బాగా నచ్చడంతో వెంట‌నే షూట్ స్టార్ట్ చేద్దామని ఉత్సాహంతో ఉన్నాడట. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ సినిమాకి హీరోయిన్ పెద్ద స‌మ‌స్య ఇబ్బందిగా మారిందట. అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీల‌కం అట ప‌ర్‌ఫెక్ట్‌గా హావభావాలు ప‌లికించే హీరోయిన్ కోసం వెతుకులాట‌లో టీం ఉంద‌ట‌. కియారా అద్వానీ, ర‌ష్మిక మంధన‌ల‌ పేర్లు వినిపించినా వారిలో ఎవరు ఈ సినిమా చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ సమస్యను గట్టెక్కి సినిమా మొదలు పెట్టాలని భావిస్తుందట సినిమా యూనిట్.

More Related Stories