English   

దర్బార్ లోకి మరో టాలెంటెడ్ యాక్టర్

darbar
2019-05-09 20:14:15

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం దర్బార్. ర‌జనీ కాంత్ ద‌ర్బార్‌ సినిమాకి రోజురోజుకీ క్రేజ్ పెరుగుతూనే ఉంది, ఈ సినిమాలోకి రోజుకొక యాక్టర్ పెరుగుతూనే ఉన్నారు. ఈమధ్యనే ఈ సినిమాలోకి బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌, నివేదా థామ‌స్ లతో పాటు తాజాగా మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ద‌ర్భార్ టీంతో జాయిన్ అయిన‌ట్టు చెబుతున్నారు. గోలి సోడా మూవీతో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన చెంబ‌న్ ఈ అందులో గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర పోషించాడు. గోలిసోడా 2 చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా విజ‌యం సాధించ‌క‌పోయిన‌ప్పటికి, చెంబ‌న్‌కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న‌ ద‌ర్భార్‌ లో కూడా చెంబ‌న్‌ విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌ని సమాచారం. ఈ సినిమాతో ఆయ‌న‌కి త‌మిళంలోనూ మంచి ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ముంబైలో జ‌రుగుతుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.
 

More Related Stories