English   

ఆ హీరో చెప్పాడని పేరు మార్చుకున్న హీరోయిన్ 

Kiara Advani Changes Name On Salman Khan Suggestion
2019-05-10 08:19:44

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న క్రేజీ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. నటన, గ్లామర్ రెండూ సమపాళ్లలో ఉన్న ఈ బ్యూటీ విభిన్న పాత్రలు చేస్తూ ముందుకు వెళ్తోంది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఆమె చేసిన లస్ట్ స్టోరీస్ లాంటి సబ్జెక్ట్స్ వేరే ఎవరూ అయితే ఒప్పుకోరు, కానీ ఆమె నటించేసి ఆశ్చర్య పరించింది. అయితే తన పేరు గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని వెల్లడించింది ఈ భామ. అదేంటంటే అసలు తన పేరు కియారా కాదట. అలియా అద్వానీ అట. ఇండస్ట్రీలోకి వచ్చే ముందు అదే పేరుతో కెరీర్‌లో కొనసాగాలనుకుందట, అయితే ఓ సందర్భంలో సల్మాన్‌ఖాన్‌ని కలిసినప్పుడు ఆయన పేరు మార్చుకోమని సూచించాడట. అలియా పేరుతో ఆల్రడీ ఒక కథానాయిక పాపులర్ అయింది కాబట్టి నీకు అదే పేరుంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మరో మంచి పేరు పెట్టుకో మని  సల్మాన్ సలహా ఇచ్చారట. దాంతో నా పేరును కియారాగా మార్చుకున్నాను అని చెప్పింది కియారా. భరత్ అనే నేను వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగులో సుపరిచితురాలైన ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్ కబీర్‌సింగ్‌లో, గుడ్ న్యూస్, షేర్షా, కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో నటిస్తోంది.

More Related Stories