English   

రాఖీ ఏంటిది ..నెటిజన్లు ఫైర్ 

rakhi
2019-05-10 09:04:32

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వివాదాలకు పెట్టింది పేరు. ఎప్పుడూ ఏదో ఒక నోటి దురుసు వ్యాఖ్యలతో వివాదాలు రేపుతూ వార్తల్లో నిలిచే ఈ భామ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు చేస్తూ, వివాదాస్పద కామెంట్లు పెడుతూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. తాజాగా, రాఖీ సావంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలు వివాదానికి దారితీశాయి. పాకిస్థాన్ జెండాను పట్టుకోవడమే కాకుండా దాన్ని తన గుండెలకు హత్తుకుని ఉన్న ఆ ఫొటోలు పస్ట్ చేయడంతో క్షణాల్లో అవన్నీ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె పోస్ట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. కొందరు అయితే అసభ్య పదజాలతో సావంత్ మీద విరుచుకు పడ్డారు. ఈ కామెంట్ల దెబ్బకు దిగొచ్చిన రాఖీ తాను పాక్ జెండా ఎందుకు పట్టుకున్నానో వివరణ ఇచ్చింది. ధారా 370 సినిమాలో పాకిస్థాన్‌కు చెందిన అమ్మాయి పాత్రలో తాను నటిస్తున్నానని, కశ్మీరి పండిట్స్ నేపథ్యంలో సినిమా ఉంటుందని ఈ సినిమా కోసమే పాక్ జెండాతో ఫోటో దిగానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో మాతృదేశంపై విపరీతమైన భక్తి కలిగిన అమ్మాయి పాత్రలో కనిపిస్తానని అంతే తప్ప తప్పుగా అర్ధం చేసుకోవద్దని చెప్పింది. 
 

More Related Stories