English   

సిక్స్ ప్యాక్ తో హల్చల్ చేసిన ప్రభాస్ హీరోయిన్ !

 shraddha kapoor
2019-05-10 11:52:58

బాలీవుడ్ న‌టి శ్రద్ధా కపూర్ అంటే ఒక క్షణం ఆలోచిస్తారేమో కానీ ప్రభాస్ సాహో హీరోయిన్ అంటే తెలుగు వాళ్ళు వెంటనే గుర్తు పడతారు, రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సాహోలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఈమెకు ఇదే మొదటి చిత్రం కావడంతో ఆమె మీద కాస్త ఆసక్తితో ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన వీడియోల్లో శ్రద్ధా లుక్ చూసి చాలా మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఇక తాజాగా అమ్మడు సిక్స్ ప్యాక్ తో దర్శనం ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది. తాజాగా ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ పూర్తి చేసి స్టూడియో నుంచి బయటికి వచ్చిన ఫోటోలను వైరల్ భయానీ పేజ్ ద్వారా సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. టైట్ ఫిట్ స్పోర్ట్స్ వేర్ లో శ్రద్ధా సిక్స్ ప్యాక్ బట్టబయలు అయ్యింది. సాహో తో పాటు ఆమె స్ట్రీట్ డ్యాన్సర్స్ 3డి అనే డ్యాన్స్ బేస్డ్ చిత్రంలో శ్రద్ధా నటిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా ఏబీసీడీ ఫేం రెమో డి.సౌజా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ సిక్స్ పాక్స్ సాధించేసింది ఈ ముద్దుగుమ్మ.

More Related Stories