English   

తెలుగులో రిలీజ్ కానున్న తొలి త్రీడీ మూవీ

Anjali
2019-05-10 12:34:13

తెలుగమ్మాయి అయినా కోలీవుడ్ లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది నటి అంజలి. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ లీసా. రాజు విశ్వనాథ్‌ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాని ఎస్‌.కె. పిక్చర్స్‌ బ్యానర్ మీద చిన్న సినిమాల నిర్మాత సురేష్‌ కొండేటి ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. చిత్రీకరణ జరిగిన తర్వాత ఈ సినిమాను డిజిటల్‌ రూపంలో త్రీడీలోకి మర్చి త్రీడీలో విడుదల చేస్తున్నారు. త్రీడీలో ఉండే ఈ సినిమాని సమ్మర్‌ కానుకగా పిల్లలు దగ్గరనుండి పెద్ద వాళ్ళందరికీ వినోదాత్మకంగా అందించడం కోసం ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. త్రీడీలో విడుదలవుతున్న తొలి తెలుగు హారర్‌ సినిమా ఇదని, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని అలరిస్తుందని చెబుతున్నారు. సలీమా, మైమ్‌గోపీ, సురేఖవాణి, కళ్యాణి నటరాజన్‌, సబితారాయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

More Related Stories