English   

మహర్షి ఫస్ట్ డే కలెక్షన్స్ 

 Maharshi
2019-05-10 12:45:10

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన సినిమా మహర్షి. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా బ్యానర్లపై నిర్మాతలు దిల్‌రాజు,అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా రూపొందిన ఈ సినిమా నిన్న విడుదల అయ్యింది. సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమా ఎక్కడా తగ్గకుండా దూసుకు వెళ్తోంది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే మొదటి రోజు దాదాపు రూ.45 కోట్లు సాధించినట్లు అంటున్నారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమెర్ సంధు సినిమా రూ.45కోట్లు రాబట్టిందని పేర్కొన్నారు. ఓవర్సీస్ లో .5 మిలియన్ మార్క్ ని అందుకోగా మిగిలిన చోట్లా మాత్రం భారీగానే కలేక్షన్ లు రాబట్టింది. రెండు రాష్ట్రాలలో అవలీలగా 22 కోట్ల నుండి 23 కోట్ల రేంజ్ లో షేర్ పక్కా అని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 45 కోట్ల రేంజ్ కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అఫీషియల్ గా నిర్మాతలు ఏమేం లెక్కలు చెబుతారో చూడాలి.

More Related Stories