English   

అయోగ్య రిలీజ్ ఆగింది !

 Vishal
2019-05-10 12:55:32

తెలుగులో ఎన్టీఆర్ హీరోగా పూరి తెరకెక్కించిన 'టెంపర్' సినిమాకి తమిళ్ రీమేక్ గా అయోగ్య సినిమా రూపొందొంది. విశాల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన రాశి ఖన్నా నటించింది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ రోజున తమిళనాట విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు డేట్ తోనే పోస్టర్స్ కూడా వదిలారు, ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ ఎందుకనో చివరి నిమిషంలో ఈ  సినిమా థియేటర్లకు రాలేదు. విశాల్‌ ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా రిలీజ్ చివరి నిమిషంలో వాయిదా పడడం, ఇప్పటికే నడిగర్‌ సంఘం వివాదాలతో ఇబ్బందుల్లో ఉన్న విశాల్‌ కు అయోగ్య సినిమా మరింత చికాకు కలిగించే విషయం. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించిన విశాల్‌, ‘సినిమా రిలీజ్ కోసం తాను చేయాల్సినదంతా చేశాను. ఓ నటుడిగా చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాను. అయినా సరిపోలేదు’ అంటూ ట్వీట్ చేశారు. 

More Related Stories