English   

తమిళ నటి ఇంట్లో దూరిన యువకుడు...పెళ్లి చేసుకోమని ?

rithika
2019-05-10 13:05:07

తమిళంలో ఫేమస్ అయిన బుల్లితెర సీరియల్ ‘రాజారాణి’లో నటిస్తున్న రితికకు పెద్ద షాకే తగిలింది. సీరియల్‌ లో చూసి రితికాను ఇష్టపడిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి నిన్న ఏకంగా ఆమె ఇంట్లోకి చొరబడి రితికాను తనకిచ్చి పెళ్లి చేయాలని రితికా తండ్రితో వాగ్వాదానికి దిగడంతో తలపట్టుకొవడం రితిక వంతు అయింది. అయితే అదృష్టం కొద్దీ ఇంటి చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి అతడిని అరెస్ట్ చేశారు. తమిళంలో రాజారాణి సీరియల్‌తో పాటు అనేక సీరియల్స్‌లో నటిస్తోన్న రితిక వడపళని వందడుగుల రోడ్ లో ఓ అపార్ట్‌మెంట్‌లో తండ్రితో పాటు ఉంటున్నారు. గురువారం ఉదయం ఓ యువకుడు అపార్టమెంట్‌లోని రితిక ఇంటి తలుపులు తట్టగా ఎవరో అనుకుని ఆమె తండ్రి తలుపు తెరిచాడు. ఇంటి లోపలికి వచ్చిన ఆ యువకుడు రితికాను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రిని కోరాడు. అది విని షాకైన సుబ్రహ్మణి ఆ యువకుడితో ససేమిరా అనడంతో ఆ యువకుడు బెదిరింపులకు దిగాడు ఇంతలో ఇంటి పక్క వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అతడిని ఇంజినీరింగ్ చదివి ఉద్యోగం కోసం చెన్నై వచ్చిన భరత్ గా గుర్తించారు. తనకు రితికా అంటే చాలా ఇష్టమని, ఆమెను పెళ్లి చేసుకుంటానని భరత్ విచారణలో కూడా చెబుతున్నాడట. దీంతో అతని తల్లి తండ్రులకి సమాచారం ఇచ్చిన పోలీసులు వారి సమక్షంలో కౌన్సలింగ్ ప్లాన్ చేస్తున్నారు. 

More Related Stories