English   

ఆమెజాన్ ప్రైంలో మజిలీ 

Majili
2019-05-10 14:56:41

పెళ్లి అయిన త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా నటించిన మూవీ మ‌జిలీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కినేని అభిమానులకు కన్నుల పండుగగా నిలిచింది. ఏంతో మంది ప్రేక్షకులకి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఏప్రిల్ 5న విడుదులైన ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనే అంటున్నారు చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకి మొదటి రెండు వారాల్లోనే 50కోట్లపైగా గ్రాస్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లందరికీ మంచి లభాలనే తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. మజిలీకి పోటీగా చిత్రలహరి, జెర్సీ, కాంచన 2, అవెంజర్స్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ హంగామా చేసినా మజిలీ వసూళ్లు పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అలాంటి మజిలీకి ఇప్పుడు గండి పడనుంది, ఎందుకంటే ఈ రోజు నుండీ ఈ సినిమాని ఆమెజాన్ ప్రైం లో అందుబాటులో ఉంచారు. చూడాలి మరి ఈ సినిమా మీద ఆమెజాన్ ప్రభావం ఏమేరకు ఉంటుందో ?

More Related Stories