English   

మహేష్ బాబు పార్టీ...బర్త్ డే బాయ్ సమక్షంలో ?

 Mahesh
2019-05-10 16:49:05

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  భారీ అంచనాల నడుమ విడుదలయిన ఈ సినిమా అంచనాలకి తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. దీంతో ఈ సినిమాకి పని చేసిన టీమ్ అంతటికీ మహేష్ బాబు పార్టీ ఇచ్చాడు.  ఈ పార్టీకి విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. నిన్న విజయ్ పుట్టినరోజు కావడంతో ఇదో స్పెషల్ పార్టీ అయింది. అలా ఈ మధ్యనే ప్రీరిలీజ్ ఈవెంట్ కి అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ మరో మరు 'మహర్షి' సెలబ్రేషన్స్ లో పాలుపంచుకున్నాడు. మహేష్ ఇచ్చిన ఈ పార్టీ నిన్న అర్ధరాత్రి దాటేవరకు కొనసాగగా విజయ్ తో పాటు ముగ్గురు నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ లు ఈ పార్టీకి హాజరయ్యారు. విజయ్ తో పాటు మహేష్ తర్వాతి మూవీ డైరెక్టర్ అనీల్ రావిపూడి అలాగే ఆ సినిమాలో ఒక హీరోయిన్ అనుకుంటున్నా రష్మిక కూడా రావడం విశేషం.  
 

More Related Stories