English   

బాలయ్యకి లేడీ విలన్ ?

Balakrishna
2019-05-10 18:36:57

నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఒక తాజా అప్ డేట్ అందుతోంది. అదేంటంటే బాలయ్యకు లేడీ విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటించబోతోందట. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి ఇప్పటికే పలు చిత్రాల్లో వరలక్ష్మి నెగెటివ్ రోల్స్ పోషించింది. తాజాగా విశాల్ హీరోగా వచ్చిన పందెం కోడి 2 సినిమాలో నటించి మెప్పించింది. అలాగే విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కూడా ఈ చిత్రంలో పవర్ ఫుల్ విల‌న్‌ రోల్ లో న‌టించ‌బోతున్నారు. లెజెండ్‌ సూపర్ డూపర్ హిట్ తర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు.  ఈ నెల 17న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయి జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
 

More Related Stories