English   

విశాల్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్

vishal
2019-05-10 20:21:27

తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విశాల్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు పెళ్లి మాటెత్తితే త్వరలోనే చేసుకుంటాను అది కూడ నడిగర్ సంఘం భవనం నిర్మించిన తర్వాతే అంటూ వచ్చిన విశాల్ నటి అనిషా తో అమ్మాయితో నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే వారి ఎంగేజ్మెంట్ కూడా హైదరాబాద్ లో జరిగింది. అయితే వీరి వివాహ ముహూర్తం మాత్రం ఖరారు చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 9వ తేదీన వీరి వివాహం జరపడానికి పెద్దలు నిర్ణయించినట్టుగా సమాచారం. అలాగే వీరి వివాహం చెన్నై లోని నడిగర్ సంఘం భవనంలో జరుగుతుందా లేదా అనే దాని మీద ఉత్కంట నెలకొంది.  తమిళంలో వరుస సినిమాలతో వరుస విజయాలతో విశాల్ దూసుకుపోతున్నాడు. ఈరోజు అయోగ్య సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించాల్సింది కానీ ఆ సినిమా వాయిదా పడింది.

More Related Stories