English   

పెళ్లి కాకుండా తండ్రి అయ్యే యోచనలో సల్మాన్

salmankhan
2019-05-10 20:49:25

బాలీవుడ్ లో చాలామంది బ్యాచిలర్లు ఉన్నారు అయితే వారందరిలో సల్మాన్ ఖాన్ ది ప్రత్యేక కేటగిరీ. ఈయన లవ్ స్టోరీస్ కి లెక్కే లేకపోయినా అదేం ధరిద్రమో కానీ ఒక్కటంటే ఒక్కటీ పెళ్ళి వరకూ వెళ్ళలేదు. రేపే పెళ్ళి ఎల్లుండే ఎంగేజ్మెంట్ అంటూ పుకార్లు వినిపించినా అవి పుకార్లు గానే మిగిలిపోయాయి. అదేంటో కానీ ఆయన ఇప్పుడు తండ్రి కావలనుకునున్నాడట, అయితే అది కూడా పెళ్లి కాకుండానే ? అదేంటా అని ఖంగారు పడకండి. నిజానికి ఇప్పటికే ఇండియాలో సరోగసీ ద్వారా చాలామంది సెలబ్రిటీలు పిల్లలను కన్నారు. అయితే అలా కన్నా వారు అందరూ పెళ్ళైన జంటలే అయితే వారిలా కాకుండా సరోగసీ విధానంలో సింగిల్ పేరెంట్ అయిన వారు కూడా ఉన్నారు.  కరణ్ జోహార్.. ఏక్తా కపూర్ లాంటి వారు అలాంటి విధానంలోనే సింగిల్ పేరెంట్ గా మారి పెళ్ళి లేకుండానే పిల్లలను కన్నారు. ఇప్పుడు సల్మాన్ కూడా అదే కోవలో తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయం మీద బాలీవుడ్ మీడియా వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటిస్తే కానీ ఈ విషయం మీద క్లారిటీ రాదూ.

 

More Related Stories