English   

దిల్ రాజు సల్మాన్ ని పట్టుకున్నాడా

dilraju
2019-05-10 21:46:43

మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి'. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిన్మా సూపర్ హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది. మహేశ్ బాబుకి 25వ సినిమా కావడం వలన, మొదటి నుంచి ఈ సినిమాపై వున్న అంచనాల కారణంగా థియేటర్లు హౌస్ ఫుల్ నడుస్తున్నాయి. అయితే నిన్న ముంబైలో ప్రభుదేవాతో కలిసి సల్మాన్ ఖాన్ ఈ సినిమా చూశారట. ఈ సినిమా నచ్చితే హిందీ రీమేక్ రైట్స్ తీసుకునే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసుకుని ఆ విషయాలు మాట్లడుకుంటారని ప్రచారం జరిగింది. గతంలో మహేశ్ బాబు చేసిన 'పోకిరి' సినిమాను హిందీలో రీమేక్ చేసి సల్మాన్ హిట్ కొట్టగా ఇప్పుడు మహర్షి మీద ద్రుష్టి పెట్టాడట. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మహర్షి మూవీ హిందీ రైట్స్ దిఒల్ రాజు ఎవరికీ ఇవ్వడం లేదని హిందీ రీమేక్‌ కూడా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. సల్మాన్ ఖానే నటించేలా  ప్రభుదేవా దర్శకత్వం వహించేలా దిల్ రాజు ప్రొడక్షన్ ప్లాన్ చేస్తుందని అంటున్నారు. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

More Related Stories