English   

అభిమాన దేవుళ్ళకు మహేష్ కృతజ్ఞతలు

mb
2019-05-10 22:17:18

మహేష్ బాబు నటించిన 'మహర్షి' మూవీ నిన్న విడుదలై హిట్ టాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఇది తన 25 వ చిత్రం కావడంతో మహేష్ ముందు నుండీ ఈ సినిమా మీద పెట్టిన శ్రద్ద సత్ఫలితాన్ని ఇవ్వడంతో ఎక్కడా తగ్గట్లేదు. నిన్న రాత్రి డైరెక్టర్ టీం అలాగే ప్రొడ్యూసర్స్ కి ఈ విజయాన్ని అందించి నందుకు ప్రత్యేకంగా ట్రీట్ కూడా ఇచ్చారు. ఇక తాజాగా ఈ  సినిమాను ఇంత పెద్ద విజయం చేసినందుకు అభిమానులకి, ప్రేక్షకులకి తన తరపున, తన టీమ్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మహేష్.  ఈమేరకు కొద్దిసేపటి క్రితం ఆయన్ ట్వీట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్, పివిపి సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇండియాలో కలెక్షన్లు బాగానే వసూలు చేస్తున్న యూ స్ మార్కెట్ డల్ అయినట్టు చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన అందాల్సి ఉంది. ఇక అప్పుడే మహేష్ తన తర్వాతి సినిమా పనులు కూడా మొదలుపెట్టేశారు.

 

More Related Stories