English   

అల్లు శిరీష్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్...నమ్మకమా .. ధైర్యమా

abcd
2019-05-11 07:19:35

చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నటించిన తాజా మూవీ ఎబిసిడి. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా అయినా ఎబిసిడికి రీమేక్. అసలు హిట్ మొహమే చూడని అల్లు శిరీష్ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్స్ మీద‘మధుర’ శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మాణంలో తెరకక్కింది. ఇక ఈ సినిమాని ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది మూవీ యూనిట్. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా ఈ సెన్సార్ కార్య‌క్ర‌మాల్ని పూర్తి చేసుకుని క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ పొందిందని, సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నారని ప్రకటించారు అల్లు శిరీష్. ఈ సినిమాలో అమెరికా నుండి ఇండియా వ‌చ్చిన ఎన్నారై పాత్ర‌లో అల్లు శిరీష్‌, అత‌ని స్నేహితుడిగా భ‌ర‌త్ నటించారు. ఆ విషయం అలా ఉంచితే మే నెలలో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే మహర్షి చిత్రం విడుదలై బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సీత చిత్రం మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క అనూహ్యంగా వాయిదా పడ్డ నిఖిల్ అర్జున్ సురవరం, సూర్య ఎన్జీకే లాంటి సినిమాలు కూడా ఇదే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఇంతా పోటీలో కూడా సినిమా రిలీజ్ చేస్తున్నారు అంటే సినిమా మీద నమ్మకం అయినా అయ్యుండాలి లేదా సురేష్ బాబు థియేటర్స్ ఉన్నాయన్న ధైర్యం అయినా అయ్యుండాలి.

More Related Stories