English   

మెహ్రీన్ భలే ఆఫర్ కొట్టేసిందే

Naga Shaurya to romance Mehreen
2019-05-11 07:55:31

అదేంటో కానీ కొందరు కధానాయికలు నటించిన సినిమాలు హిట్ కొట్టినా వారికి మాత్రం పెద్దగా పేరు రాదు. సరిగ్గా టాలీవుడ్ హీరోయిన్ మేహ్రీన్ ఈ కోవలోకే వస్తుంది. ఈ ఏడాది ఎఫ్ 2 తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టడంతో ఈ సినిమా తరువాత ఆమె చాలా బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ మెహ్రీన్ మాత్రం అవకాశాల కోసం వెతుక్కోవల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చిత్రం తరువాత పలు పెద్ద ప్రాజెక్ట్ లలో అవకాశాలు వస్తాయని అనుకోని ఎదురుచూసిన మెహ్రీన్ కు నిరాశే మిగిలింది. అయితే ఇటీవల గోపీచంద్ -తిరు సినిమా లో ఛాన్స్ దక్కించుకున్న ఈబ్యూటీ తాజాగా మరో తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత నాగశౌర్య హీరోగా ఆయన సొంత బ్యానర్ లోనే ఒక సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన తన సరసన హీరోయిన్‌గా మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. ఇక ప్రస్తుతం శౌర్య శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కంప్లీట్ చేసి శౌర్య తన సొంత సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడట.  

More Related Stories