English   

బుల్లితెరకు షిఫ్ట్ అవుతున్న బెబో 

Kareena Kapoor
2019-05-11 09:45:23

పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గడం మన హీరోయున్స్ కి మామూలే, అలా అవకాశాలు తగ్గినప్పుడు వారు తమ పరిధి మేరకు వదిన పాత్రలకు షిఫ్ట్ అవ్వడమో, హీరోయిన్ సిస్టర్ పాత్రలకు షిఫ్ట్ అవ్వడమో చేస్తుంటారు, మరి కొందరు బుల్లి తెరకు షిఫ్ట్ అయ్యి అక్కడ కొన్ని షోలకి జడ్జేస్ గా ఫిక్స్ అయి పోతుంటారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ కూడా అదే కోవలో బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ ప్రముఖ చానెల్‌కు చెందిన డ్యాన్స్‌ షోలో ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారని సమాచారం. జూన్‌లో స్టార్ట్‌ కానున్న ఆ షోలో ఆమె జడ్జ్ గా ఉండనున్నారు. ఇప్పటికే షో విధి విధానాలు, వాటికి సంబంధించిన విషయాల మీద ఆమె ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఇప్పటికే ఒక మారు రిహార్సల్స్‌ కూడా చేశారని అంటున్నారు. కరీనా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనుండటం ఇదే తొలిసారి కాగా ఆమె మీద్యనే గుడ్‌న్యూస్‌ సినిమాకి ప్యాకప్ చెప్పి అంగ్రేజీ మీడియం సినిమాతో బిజీగా ఉన్నారు.

More Related Stories