English   

హాట్ సమ్మర్ లో కూల్ చేయనున్న రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌

 Romantic criminals
2019-05-11 12:21:58

ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌ క‌థ‌ లాంటి బూతు సినిమా లాంటి క‌మ‌ర్షియ‌ల్ హిట్ సినిమాలు తీసిన సునీల్ కుమార్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తాజా మూవీ రొమాంటిక్ క్రిమిన‌ల్స్‌. ఈ నెలలో విడుఅలవుతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఆయన తీసిన గత సినిమాలల్లో లానే ఈ సినిమాలో కూడా సింహ భాగం బోల్డ్ కంటెంట్ ఉండటంతో ఈ సినిమాకి A సర్టిఫికెట్‌ లభించింది.  ఆయన గతంకో తీసిన ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌క‌థ సినిమాలకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాని మే 17న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా అంతా వైజాగ్ లో షూట్ చేశారు అలాగే పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ అంతా విశాఖ‌ప‌ట్నంలో తొలిసారిగా నిర్మించిన పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ రిసాలి స్టూడియోలో చేశారు. విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలను ఈ సినిమా ద్వారా ఏకరువు పెట్టె ప్రయత్నం చేశారు. రోజూ మన చుట్టుపక్కల లేదా తెలిసిన వాళ్ళ ఇళ్ళలో జరుగుతున్న విషయాలనే కాస్త కమర్శియల్ హంగులతో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు.

More Related Stories