English   

నాని శ్రీకాంత్ కధ ఒప్పుకున్నాడా ?

Nani
2019-05-11 12:55:02

నాని కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'జెర్సీ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆయన గత దేవదాస్ లాగే ఈ సినిమా కూడా మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా ఆశించిన మేర అంచనాలను అందుకోలేదు. కాంచన దెబ్బకు జెర్సీకి గట్టిగానే పడింది. దాంతో ఆయన తన తర్వాతి సినిమా మీద ద్రుష్టి పెట్టాడు. ఆయన విక్రం దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రాజెక్టును కూడా నాని పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి 'వి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమాలతో పాటు తరువాత సినిమాను కూడా నాని లైన్లో పెట్టేశాడని అంటున్నారు. ఇటీవల నానీని కలిసి బ్రహ్మోత్సవం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఒక కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. 'బ్రహ్మోత్సవం' పరాజయంపాలైన తరువాత, శ్రీకాంత్ అడ్డాలతో చేయడానికి చాలామంది హీరోలు భయపడ్డారు. ఎందుకంటే ఆ  సినిమా మహేష్ కెరీర్ లో చేరుపుకోలేని మచ్చగా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ మధ్య కూచిపూడి వారి వీడి అంటూ ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకుని గీత ఆగేస్ చుట్టూ శ్రీకాంత్ తిరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి మరి అది ఇదీ ఓకే సబ్జేక్టా వేరేదా అనేది తేలాల్సి ఉంది
 

More Related Stories