English   

విశాల్ సినిమా ఆగింది అందుకేనా ? తమిళ ఇండస్ట్రీకి ఏమయ్యింది ?

Ayogya
2019-05-11 15:48:17

తెలుగు టెంపర్ రీమేక్, హీరో విశాల్ తాజా మూవీ అయోగ్య షెడ్యూల్ ప్రకారం నిన్న రిలీజ్ కావలిసి ఉంది. ముందు నుండీ అదే డేట్ తో ప్రమోషన్స్ జరగడంతో అయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చేసుకున్నారు. ఏమయిందో ఏమో కానీ చివరి నిముషంలో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. విశాల్ సినిమాతో పాటు ఈ నెల 3న రిలీజ్ కావాల్సిన అధర్వ మురళి 100 సినిమా అలాగే విజయ్ సేతుపతి సింధు బాద్ సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ అన్ని సినిమాల రిలీజ్ ఆగడానికి కారణం ఆర్ధిక ఇబ్బందులే అని అంటున్నారు. తమిళంలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు నిర్మాతల మండలి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి.  విశాల్ సినిమాకు ఆల్రెడీ ఆ నో అబ్జెక్షన్ వచ్చేసినా సినిమాకి మాత్రం మోక్షం కలగలేదు. దీంతో ఈ సినిమాకు ఫైనాన్స్ సమస్యలే ప్రధాన కారణం అని అంటున్నారు. నిన్న ఉదయమే ఈ విషయం మీద స్పందించిన విశాల్ ఎమోషనల్ గా ఒక ట్వీట్ పెట్టాడు కానీ అసలు కారణం ఏంటని మాత్రం వెల్లడించలేదు. నిన్న రాత్రి సమయంలో  కూడా ఈ సినిమాను ఎప్పటికీ వదిలి పెట్టనని అయోగ్య తనకు ఒక ప్రత్యేకమైన సినిమా అని, ఇది సామాజిక సమస్య మీద తెరకెక్కించిన చిత్రం.  అని తను ఈ సినిమాను చేసినందుకు గర్విస్తున్నాననని,  సినిమా తప్పనిసరిగా వస్తుందని ఎమోషనల్ అవుతూ మరో ట్వీట్ పెట్టాడు. అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మాత్రం వెల్లడించలేదు.

More Related Stories