English   

నాగశౌర్య కొత్త సినిమా మొదలయ్యింది  

 Naga Shourya
2019-05-11 17:26:42

కొద్ది రోజుల నుండి ప్రచారం జరిగినట్టే ఈరోజు నాగ‌శౌర్య‌ సొంత బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్‌లో ప్రొడక్ష‌న్ నెం-3 ఈ రోజు ప్రారంభ‌మైంది.  గతంలో ఈ సంస్థ నుండి చలో, నర్తనశాల సినిమాలు రిలీజ్ కాగా ఛలో హిట్ అయింది, నర్తన శాల ఒక అనుభవంగా మిగిలింది. ఇక ఈ రోజు పూజా కార్యక్రమాలు జరుపుకున్నా ఈ సినిమాతో  రమణ తేజ అనే ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఉషాముల్పూరి  నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ‌శౌర్య  కి  జంట‌గా మెహరీన్ నటిస్తుంది.  ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు  కె.రాఘ‌వేంద్ర‌రావు క్లాప్ కొట్టి  స్క్రిప్ట్ ని డైరెక్టర్ రమణ తేజకు అందించగా మొదటి సన్నివేశానికి ప‌ర‌శురామ్ గౌర‌వ‌ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇక దర్శకురాలు నందిని రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 13నుంచి మొద‌లవుతుందని, 70శాతం షూటింగ్ వైజాగ్‌లో చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారాణి అంటున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే డైరెక్టర్ ర‌మ‌ణ‌శౌర్యకి ఫ్రెండ్ అట. వీరిద్దరూ క‌లిసి యు.ఎస్‌. లో బూస్ట‌న్ ఫిల్మ్ స్కూల్లో చాదువుకున్నారట. చూడాలి ఈ సినిమా మనోడికి మంచి హిట్ ఇస్తుందేమో ?

More Related Stories