English   

విజయ్ డైరెక్టర్ హీరో అయ్యాడు...ఏమున్నాడురా బాబు ?

Tarun Bhaskar As Hero
2019-05-11 19:54:42

పెళ్లి చూపులు సినిమా అంత సూపర్ డూపర్ హిట్ కాకపోయినా విజయ్ దేవరకొండ అనే నటుడు టాలీవుడ్ లో ఉన్నాడని తెలిసేలా చేసిన సినిమా అది. అంతుకు ముందు ఎన్నో సినిమాలు చేసినా దక్కని గుర్తింపు ఈ సినిమాతో దక్కింది విజయ్ కి దీంతో తనకి అంతటి గుర్తింపు ఇచ్చిన ఆ డైరెక్టర్ కి గుర్తుండిపోయేలా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడో ఏమో కానీ ఏకంగా ఆ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ని హీరోని చేసి పడేశాడు విజయ్. తరుణ్ భాస్కర్ హీరోగా ‘కింగ్ అఫ్ ది హిల్’ బ్యానర్‌పై సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. నూతన దర్శకుడు షమ్మిర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ వాణీ భోజన్ హీరోయిన్‌ గా నటిస్తోందని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన రాకపోయే సరికి కాస్త మరుగున పడింది. అయితే అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుందట, అంతకు ముందు బొద్దుగా కనపడిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో చూస్తే వెంటనే గుర్తు పట్టలేం అలా ఉంది మనోడి లుక్. తాజాగా లీక్ అయిన హీరో హీరోయిన్స్ లుక్స్ మీరు కూడా చూసెయ్యండి మరి.

More Related Stories