English   

తాప్సీ సినిమా మూడు బాషలలో...ఇక్కడ చెల్లని కాణీ అక్కడ మాత్రం

Anurag Kashyap to Present Taapsee Pannu Tamil Film Game Over
2019-05-11 19:56:18

రాఘవేంద్రరావు ఝుమ్మంది నాదం సినిమాతో తెరంగ్రేటం చేసిన ఢిల్లీ భామా తాప్సీకి తెలుగు ఇండస్ట్రీ పెద్దగా అచ్చిరాలేదు. దీంతో సౌత్ లో మిగతా బాషలలో ట్రై చేస్తూనే హిందీలో కూడా బిజీ అయ్యింది ఈ భామ. ప్రస్తుతం ఆమె గేమ్ ఓవర్ అనే తమిళ సినిమాలో నటిస్త్తోంది. ఈ చిత్రంలో తాప్సీ వీడియో గేమ్ డెవలపర్ పాత్రలో కనిపించనుందట. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాని గతంలో నయన తారతో మాయ అనే సినిమా చేసిన అశ్విన్ శరవణ్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళంతోపాటు హిందీ భాషలో కూడా విడుదలకానుంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ , వై నాట్ స్టూడియోస్‌తో కలిసి ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్నీ హిందీలో విడుదలచేయనున్నాడు. తెలుగులో చెల్లని కాణీ అనిపించుకున్న తాప్సీ ఒక తమిళ సినిమా చేయడం దానిని తెలుగు, హిందీలోకి అనువదించి రిలీజ్ చేయడం అంటే గొప్ప విషయమే.

 

More Related Stories