English   

తమిళమ్మాయి హీరోయిన్ గా మిస్ మాచ్

Miss Match Movie First Look Launched By Director Krish
2019-05-11 20:34:18

హీరో ఉదయ్‌ శంకర్ అంటే గుర్తు పట్టడం కష్టం కానీ గతేడాది రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు పొందిన ఆటగదరా శివ ఫేం మూవీ హీరో అంటే యిట్టె గుర్తు పడతారు. ఆయన తాజాగా కధానాయకుడిగా నటిస్తున్న చిత్రం మిస్ మ్యాచ్. విజయ్ అంటోనీతో డా.సలీమ్ సినిమా తెరకెక్కించిన ఎన్.వి. నిర్మల్‌ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి తమిళ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అధిరోహ్ క్రియేషన్స్ బ్యానర్ మీద జి.శ్రీరామ్, రాజు, భరత్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈరోజు దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. అయ్తితే ఈ సందర్భంగా సినిమా హిట్ కావాలని క్రిష్ అభిలాషించారు. ఇక ఈ సినిమా కథ విన్నప్పుడే తప్పకుండా చేయాలనుకున్నానని, అనుకున్నట్టుగానే సినిమా అద్భుతంగా వస్తోందని హీరో ఉదయ్‌శంకర్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా ఒక స్వచ్ఛమైన ప్రేమకథ అనిబొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, కంచె సినిమాల సరసన నిలబడేలా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. హీరోయిన్ తమిళమ్మాయి కావడంతో ఈ సినిమా అక్కడ కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

More Related Stories