English   

అనిల్ రావిపూడి సినిమా తర్వాత మహేష్ ప్రాజెక్ట్ అదేనా

mb
2019-05-11 20:59:20

మహేశ్ బాబు హీరోగా 25వ సినిమాగా మహర్షి ప్రేక్షకుల ముందుకు వచ్చి వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ కూడా తెచ్చుకుని మహేష్ కెరీర్ లో ఒనాఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తోంది. దీంతో ఇప్పుడు మహేశ్ బాబు దృష్టి ఇప్పుడు ఆయన తర్వాతి సినిమా మీద పడింది. మహేశ్ బాబు తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. ఈ క్రమంలో ఆయన 27వ సినిమాను ఎవరితో చేస్తాడు అనే చర్చ కూడా మొదలయ్యింది. నిజానికి మహేష్ కి అరడజను మందికి పైగా దర్శకులు కధ వినిపించారు. అందులో రాజమౌళి, త్రివిక్రమ్,  సుకుమార్, సందీప్ రెడ్డి, పరశురామ్ లు వున్నారు. అయితే ఈ అయిదుగురు దర్శకుల జాబితాలో మొదటి నలుగురు వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. అవి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలీదు. వీరిలో ఒక్క పరశురామ్ మాత్రం మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ కోసమే వెయిట్ చేస్తున్నాడట. కనుక మహేశ్ 27వ సినిమా పరశురామ్ దర్శకత్వంలో రూపొందే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గీతా ఆర్ట్స్ కూడా ఎట్టి పరిస్థితిలో మహేష్ తో అవకాశాన్ని విడిచిపెట్టే ఆలోచనలో లేరని తెలుస్తోంది. 

More Related Stories