English   

చిరంజీవి సంచలన నిర్ణయం....ఫ్యాన్స్ కి వరమే

chiru
2019-05-11 21:24:26

ఇప్పటికే నటుడు మంచు మోహన్ బాబు విద్యా రంగంలో  ఉన్నారు, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు మంచు విష్ణు  ఆక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ మొదలు పెట్టారు. తాజాగా ఇదే రంగంలోకి  మరో సినీ కుటుంబం అడుగు పెడుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి మెగా స్టార్ చిరంజీవి పేరిట ఆయన ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రారంభిస్తున్నారు. అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్నామని ఆ స్కూల్స్  సీఈవో జె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ను అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పెర్కొన్నారు.  ఈ ఎకడమిక్ యియర్ అంటే జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏసీ క్లాస్ రూమ్ లు, ఆడియో విజువల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ, పేరెంట్-టీచర్ మీటింగ్స్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రత్యేకంగా ట్రయిన్ చేస్తామని చెబుతున్నారు. ఇక ఈ స్కూల్స్ కి మెగాస్టార్ చిరంజీవి గౌరవ వ్యవస్థాపకులుగా, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబు గౌరవ చైర్మన్ గా, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు గౌరవ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఈ స్కూల్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్లలకి ప్రత్యేక ఫీజు రాయితీలు ఉంటాయని చెబుతున్నారు. చూడాలి విద్యా రంగంలో చిరంజీవి స్కూల్స్ ఎన్ని మార్పులు తేనున్నాయో ?

 

More Related Stories