English   

అజయ్ సినిమా లేనట్టేనా .. ఆయన ఒప్పుకుంటాడా

ajay
2019-05-12 07:32:41

ఒక సినిమా హిట్ అయిందంటే ఇక ఆ డైరెక్టర్ చుట్టూ అవకాశాలు క్యూ కడతాయి. ఈ డైరెక్టర్ కి కూడా కట్టాయి, కానీ ఎందుకో ఒక్క సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళలేక పోయింది. ఆయనే ఆర్ ఎక్స్ 100 మూవీ తీసి దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న అజయ్ భూపతి. ఈ సినిమా ఒక రేంజ్ లో వసూళ్లను రాబట్టడంతో, ఇక ఈ దర్శకుడు వరుస సినిమాలతో హోరెత్తిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇంతవరకూ ఆయన మరో ప్రాజెక్టును సెట్ చేసుకోకపోవడం గమనార్హం. ఆయన మూవీ చైతూ హీరోగా సమంతా హీరోయిన్ గా ఉండొచ్చనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే  చైతూతో సినిమా ఇప్పట్లో లేనట్టేనని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం చైతూ వెంకీమామ సినిమాతో బిజీగా వున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన దిల్ రాజు బ్యానర్లో మరో ప్రాజెక్టు చేయనున్నట్టు సమాచారం. అందువలన చైతూ అందుబాటులో లేనట్టేనని అంటున్నారు. దీంతో అజయ్ మాస్ మ‌హారాజా తలుపు తట్టాడని అంటున్నారు. ఈ మ‌ధ్య కాస్త ట్రాక్ తప్పినా రవి తేజ ప్రస్తుతం డిస్కో రాజా చేస్తున్నాడు. అయితే ఎంతో మంది దగ్గర వర్కౌట్ కాని మహా సముద్రం రవి తేజతో వర్కౌట్ అవుతుందేమో చూడాలి మరి.

More Related Stories